Friday, September 25, 2009

talachi talachi chooste tarali dariki vasta

talachi talachi chooste tarali dariki vasta
7/g Brundavan colony
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికే ఉంటిని
ఓ... నీలో నన్ను చూసుకొంటిని
తెరిచి చూసి చదువవేల
కాలి పోయే లేఖ రాసా
నీకై నేను బ్రతికే ఉంటిని
ఓ... నీలో నన్ను చూసుకొంటిని

కొలువు తీరు తరువుల నీడ చెప్పుకొనును మన కధనిపుడు
రాలిపొయిన పూల గంధమా

రాక తెలుపు మువ్వల సడిని తలచుకొనును దారులు ఎపుడు
పగిలిపొయిన గాజులు అందమా

అరచేత వేడిని రేపే చెలియ చే నీ చేత
ఒడిలో వాలి కధలను చెప్ప రాసిపెట్టలేదు
తొలి స్వప్నం కాదులే ప్రియతమా
కనులు తెరువుమా

మధురమైన మాటలు ఎన్నోకలసిపోవు ఈ పలుకులలో
జగము కరుగు రూపే కరుగునా

చెరిగి పోని చూపులు అన్నీ రేయి పగలు నిలుచును నీలో
నీదు చూపు నన్ను మరచునా

వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు
కళ్ళ ముందు సాక్షాలున్నాతిరిగి నేను వస్తా
ఒక సారి కాధురా ప్రియతమా
ఎపుడూ పిలిచినా

తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికే ఉంటిని
ఓ..నీలో నన్ను చూసుకొంటిని

No comments:

Post a Comment