Friday, September 25, 2009

Mounamu gaane edagamani mokka neeku cheputundi

maunamgaane edagamani mokka neeku cheputundi
naa autograph

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.
ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది.
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా ..దరికి చేర్చు దారులు కుడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని భాదపడకు నేస్తమా..భాద వెనుక నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలవగానే విషమే వచ్చింది ..విసుగే చెందక క్రుషి చెస్తేనే అమ్రుతమిచ్చింది

అవరోధాల దీవుల్లొ అనంద నిధి ఉన్నది ..కస్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది .
తెలుసుకుంటే సత్యమిది ..తలచుకుంటే సాధ్యమిది

చెమట నీరు చిందగా నుదిటి రాత మర్చుకో ..మర్చలేనిది ఏది లేదని గుర్తుంచుకో ..
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో ..మారిపోని కధలే లేవని గమనించుకో ..
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు ..నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే వ్రాయాలి ..
నీ దైర్యన్ని దర్శించి దైవాలే తల దించగా ..నీ సంకల్పానికి అ విధి సైతం చేతులెత్తాలి ..
అంతులేని చరితలకి ఆది నువ్వు కావలి...

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది..ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.

No comments:

Post a Comment