Wednesday, September 23, 2009

Emindi Ee vela Edalo Ee sandadela

Emindi Ee vela Edalo Ee sandadela
AMAV

ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేల
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే
చిరు చెమటలు పొయెనేల

ఏ శిల్పి చెక్కెనీ శిల్పం
సరికొత్తగా ఉంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం

మనసులోన వింత మోహం
మరువలేని ఇంద్రజాలం
వాన లోన ఇంత దాహం

చినుకులలొ వాన విల్లు నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే
తన సొగసే తీగ లాగ నా మనసే లాగెనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే

నిశీధిలొ ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే

చిలిపి కనులు తాళమేసే
చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాట పాడే
తనువు మరిచి ఆటలాడే

ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేల
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పొయెనేల

ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింక
ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసెనా
తన నడుము వంపులోనే నెలవంక పూచెనా

కనుల ఎదుటే కలగా నిలిచా
కలలు నిజమై జగము మరిచా
మొదటి సారి మెరుపు చూసా
కడలి లాగే ఉరకలేసా

ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేల
మిల మిల మిల మేఘమాల చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పొయెనేల

No comments:

Post a Comment