Thursday, September 24, 2009

Nammaka tappani Nijamina,Bommarillu

Nammaka tappani Nijamina
Bommarillu

నమ్మక తప్పని నిజమైనా
నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా

ఎవ్వరు ఎదురుగ వస్తున్నా
నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపుల నొదిలేనా

ఎందరితో కలిసున్నా
నేనొంటరిగానే ఉన్నా
నువ్వొదిలిన ఈ ఏకాంతం లోనా

కన్నులు తెరిచే ఉన్నా
నువ్వు నిన్నటి కలవే అయిన
ఇప్పటికీ ఆ కలలో నే ఉన్నా

నమ్మక తప్పని నిజమైనా
నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా

ఈ జన్మంతా విడిపోదీ జంట అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా
నా వెనువెంట నువ్వే లేకుండారోజూ చూసిన ఏ చోటైన నను గుర్తిస్తుందా
నిలువున నను తడిమి అలా వెనుదిరిగిన చెలిమి అల తడి కనులతో నిను వెతికేది అలా

నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలోఎన్నాళ్ళైన ఈ నడిరాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమా సిరివెన్నెల పరిమళమాచేజారిన ఆశల తొలివరమా

నమ్మక తప్పని నిజమైనా
నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా

No comments:

Post a Comment