Friday, September 25, 2009

andela ravamidi padamulada ambaramantina hridayamuda

andela ravamidi padamulada ambaramantina hridayamuda
swarna kamalam
ఓం నమో నమో నమఃశివాయ

మంగళ ప్రదాయ గోతురంగతే నమఃశివాయ
గంగ యాతరంగితొత్తమాంగతే నమఃశివాయ

ఓం నమో నమో నమఃశివాయ

శూలినే నమో నమః కపాళినే నమఃశివాయ
పాలినే విరంచితుండ మాలినే నమఃశివాయ

ఆందెల రవమిది పదములదా

అందెల రవమిది పదములదా
అంబర మంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా
అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు ఎద సడిదా

సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా

మువ్వలు ఉరుముల సవ్వడులై
మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై
మెలికలు మెరుపుల మెలకువలై

మేను హర్ష వర్ష మేఘమై
వేణి విసురు వాయువేగమై
అంగ భంగిమలు గంగ పొంగులై
హావ భావములు నింగి రంగులై
లాస్యం సాగే లీల రసఝరులు జాలువారేల

జంగమమై జడ పాడగ జలపాత గీతముల తోడుగ
పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగ

ఆందెల రవమిది పదములదా

నయన తేజమె న కారమై
మనో నిశ్చయం మ కారమై
శ్వాస చలనమె శి కారమై
వాంచితార్ధమె వా కారమై
యోచన సకలము యః కారమై

నాదం న కారం మంత్రం మ కారం స్తొత్రం శి కారం వేదం వా కారం యఙం య కారం

ఓం నమఃశివాయ


భావమె మౌనపు భవ్యము కాగ
భరతమె నిరతము భాగ్యము కాగ
పురిల గిరులు తరిగేల తాండవమాడే వేళ

ప్రాణ పంచమమె పంచాక్షరిగ పరమ పదము ప్రకటించగా
ఖగోళాలు పదకింకునులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా
అందెల రవమిది పదములదా
అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు ఎద సడిదా

4 comments:

  1. the great sirivenela seta ramasastry garu the great lyricist

    ReplyDelete
  2. Great Lyrics
    Great Composition
    Great singing

    ReplyDelete
  3. భావమె భవునకు (భవుడు = శివుడు) భావ్యము కాగ, తుహిన (మంచు) గిరులు కరిగేల, ప్రాణ పంచకమె...

    ReplyDelete