Sunday, September 27, 2009

telugu songs lyrics Amrutha kadasaari veedukolu kannetitho maa chervaalu

కడసారిది వీడ్కోలు కన్నీటితొ మా చెవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కలగనమా
ఆశలు సమాధి చేస్తు బంధాలను బలి చేస్తు
ప్రాణాలె విడిచి సాగే పయనమిది ఓఓఓఓఓ

కడసారి||

తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా
తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా
ఉన్న ఊరిలొ ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా గలదా
జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం
జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం
కదిలే నదులారా కలలే అలలౌనా
జనని జన్మ భూమి స్వర్గాదపి గరీయశి
కన్నీటి తెరలలో తల్లి తేలని
కడసారి పేగు కనలేక కదిలిపోయేనో

కడసారి||

పాడె జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే
పాడె జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే
ఉదయ సూర్యుడె విలయ ధూమపు తెరలో దాగే
పూలలోల నిన్నటి నిదర ముళ్ళుగ నా ఇప్పటి నడక
ఉసురే మిగిలుంటే మరలా దరిచేరవా
మనసే మిగిలుంటే ఒడిలో తలదాచవా
తలపే అల్పం తపనలే అధికం
పరుగెత్తిన హౄదయం మోసుకునేపోతున్న

కడసారి||

No comments:

Post a Comment