Sunday, September 27, 2009

telugu songs lyrics athadu lyrics,neetho cheppana neekkooda telisina lyrics

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా
గారం చేసినా నయగారం చూపినా కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా
నేనే నేనుగా లేనే లేనుగా ఆ ఆ ఆ ఆ నా కన్నులా నీదే వెన్నెలా ఓ ఓ ఓ

ఇంకొంచం అనుకున్నా ఇకచాల్లే అన్నానా వదలమంటె ఏమిటర్ధం వదిలి పొమ్మనా
పనిమాలా పైపైనా పడతావేం పసికూనాముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా
మగువ మనసు తెలిసేనా మగజాతికీ మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికీ కూత దేనికి
గారం చేసినా నయగారం చూపినా కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా

ఒదిగున్నా ఒరలోనా కదిలించకె కుర్రదానా కత్తిసాముతో ప్రమాదం పట్టు జారెనా
పెదవోపని పదునైనా పరవాలేదనుకోనా కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా
సొంత సొగసు బరువేనా సుకుమారికీ
అంత బిరుసు పరువేనా రాకుమరుడంటి నీ రాజసానికి
గారం చేసినా నయగారం చూపినా కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా
నేనే నేనుగా లేనే లేనుగా ఆ ఆ ఆ ఓ... నా కన్నులా నీదే వెన్నెలా ఓ ఓ ఓ

1 comment:

  1. Excellent song lyrics and100 percentage pure Telugu language and shows great presitage of Telugu language.

    ReplyDelete