Friday, October 2, 2009

telugu songs lyrics devadasu (old) lyrics kala idani nijamidani

కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే
పసితలపూ మనోరథం వెన్నెలనీడై
పోయేనులే బ్రతుకింతేనులే ఓ . . .
పసితలపూ మనోరథం వెన్నెలనీడై
పోయేనులే బ్రతుకింతేనులే ఓ . . .

ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే
ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే
వరమింతే
చివురించిన పూదీవే విరియగా
విరితావులు దూరాలై చనేనులే ప్రేమ ఇంతేలే
పరిణామమింతేలే

నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో
నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో
హితవేమో
ఎది నేరని ప్రాయానా చనువునా
రవళించిన రాగమ్మే స్థిరమ్మౌ యోగమింతేలే
అనురాగమింతేలే

No comments:

Post a Comment