Thursday, October 1, 2009

telugu songs lyrics ekkaDa ekkaDa ekkaDa undO taaraka

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక,మురారి

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఒహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
నాకోసమే తళుక్కందో నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
యే వూరే అందమా ఆచూకి అందుమా
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా

కులుకులొ ఆ మెలికెలు మేఘాలలో మెరుపులు
పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
పదునులు ఆ చూపులు చురుకైన ఛుర కత్తులు
పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు
నా గుండెలో అదోమాదిరి నింపేయకే సుధామాధురి
నా కళ్ళలో కలల పందిరి అల్లేయకోయి మహాపోకిరి
మబ్బులో దాగుంది తనవైపే లాగింది
సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది
ఒహూ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక

ఎవ్వరు నన్నడగరే అతగాడి రూపేంటని
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వుని
మెరుపుని తొలి చినుకుని కలగలిపి చూడాలని
ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియని
ఎన్నాళిలా తనొస్తాడని చూడాలటా ప్రతి దారిని
యేతోటలో తనుందోనని యెటు పంపనూ నా మనసుని
ఏ నాడు ఇంతిదిగా ఖంగారే యెరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా

అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగకా

No comments:

Post a Comment